News

సియం కెసిఆర్‌తో ముగిసిన డీఎస్ భేటీ


తెలంగాణ సిఎం కెసిఆర్‌తో కాంగ్రెస్ అగ్రనేత డీఎస్ భేటీ ముగిసింది. కాంగ్రెస్ అధిష్ఠానం తీరుపై ఆగ్రహంతో ఉన్న డీ.శ్రీనివాస్ టిఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం చేసుకున్నాడన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం డీఎస్ కెసిఆర్‌తో భేటీ కావద్స్డం ప్రాధాన్యత సంతరించుకుంది. డీఎస్‌ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ నేతలు యత్నిస్తున్నారు. కానీ కారు ఎక్కేందుకే డీఎస్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కెసిఆర్‌తో భేటీ ముగిసిన అనంతరం బయటకు వచ్చిన డీఎస్‌ను మీడియా పలు ప్రశ్నలు అడిగింది. కానీ ఆయన మాత్రం అన్ని వివరాలు తరలోనే చెబుతానంటూ వెళ్లిపోయారు.